Great news for TS POLICE from CM KCR

Speed Info

తెలంగాణ పోలీసులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల వర్షం కురిపించారు … హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఎస్సై స్థాయినుండి డీజీ స్థాయి వరకూ అధికారులతో కేసీఆర్‌ సమావేశమయ్యారు … ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ మహిళా పోలీసుల సౌకర్యాలు కల్పించాలని సూచించారు … దీనికవసరమైన సొమ్మును ప్రభుత్వమే మంజూరు చేస్తుందని కేసీఆర్‌ చెప్పారు … అలాగే ప్రమోషన్లు ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిందేనని, దానికి అవసరమైన జాబితాలు తయారు చేసి పైరవీలకు, మెహర్బానీలకు ఆస్కారం లేకుండా ప్రమోషన్లు ఇచ్చేయండంటూ కేసీఆర్‌ ఆదేశించారు … దీంతోపాటు పెన్షన్ల విషయంలో కూడా ఓ పాలసీని తయారు చేయాలని, రిటైర్‌ అయ్యే నాడే ఆ ఉద్యోగికి సంబంధించిన ప్యాక్‌ అందించాలని సూచించారు … —————— LAW AND ORDER ———————— తెలంగాణాలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉండటం వల్లనే తాను ఇతర అంశాలపై దృష్టి సారించగలుగుతున్నానని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు చెప్పారు … హెచ్‌ఐసీసీలో పోలీసులతో సమావేశమైన చంద్రశేఖర్‌ రావు హైదరాబాద్‌ సహా జిల్లాల శాంతి భద్రతల నిర్వహణలో పోలీసులు బాగా పని చేస్తున్నారని అన్నారు … ఈ విషయంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డితోపాటు పోలీసులకు కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు … పోలీసులకు కొత్త వాహనాలు సమకూర్చడానికి 500 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని కేసీఆర్‌ చెప్పారు … ————– ఎస్సై, సీఐ ఎప్పుడూ అప్‌డెట్ అయి ఉండాలన్నారు. నేను చెప్పేది రైట్ అని మీరంటార‌నుకుంటాన‌ని సీఎం అన్నారు. జోన్ల స‌మ‌స్య‌ను స్ట్రీమ్‌లైన్ చేయాల‌న్నారు. డిపార్ట్‌మెంట్ హెడ్స్‌కు ప్ర‌మోష‌న్ త‌ప్ప‌క ఇవ్వాలన్నారు. ప్ర‌మోష‌న్ త‌గిన స‌మ‌యానికి ఇస్తే అదే బెస్ట్ రిఫార్మ్ అవుతుందన్నారు. అలా చేస్తే డ్యూటీ గురించి ఆలోచించాల్సిన ఇబ్బంది ఉండ‌ద‌న్నారు. ప్ర‌మోష‌న్ల‌ అంశంపై ప్ర‌భుత్వం స‌హ‌కారం ఉంటుంద‌న్నారు. రిటైర్ అయ్యే పోలీసుల‌కు అన్ని అవ‌స‌రాలు క‌ల్పించాల‌న్నారు. పెన్ష‌న్ అర్హ‌త ఉన్న‌వారు, పైర‌వీల‌కు వెళ్ల‌కుండా చూసుకోవాల‌న్నారు. రిటైర్ అయ్యే పోలీసుల పెన్ష‌న్ ప్యాక్ ఎప్పటిక‌ప్పుడు రెడీగా ఉండాల‌న్నారు. ప‌ద‌వీ విమ‌ర‌ణ చేసిన పోలీసుల‌ను స‌క‌ల మ‌ర్యాద‌ల‌తో సాగ‌నంపాల‌న్నారు. మ‌హిళా పోలీసుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చూడాల‌న్నారు. పోలీస్ క‌మీష‌న‌రేట్ ఎలా ఉండాల‌న్న అంశంపై ట్రైనింగ్ తీసుకోవాల‌న్నారు ———— తెలంగాణ వ‌స్తే రాష్ట్రం న‌క్స‌లైట్ల మ‌యం అవుతుంద‌ని, లా అండ‌ర్ ఆర్డ‌ర్ కంట్రోల్‌లో ఉండ‌ద‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయ‌ని, మ‌న మీద ర‌క‌ర‌కాల ప్ర‌చారం చేశార‌న్నారు. అటాంటి ఆరోప‌ణ‌ల‌ను అన్నింటిని ప‌టాపంచ‌లు చేసిన పోలీసుల‌కు ద‌క్కుతుంద‌న్నారు. ఢిల్లీ వెళ్లిన ప్ర‌తిసారి ప్ర‌ధాని, హోంమంత్రి వెళ్లిన సంద‌ర్భంలో వాళ్లు ప్ర‌శంసించారు. తెలంగాణ పోలీసులు గొప్ప‌ప‌ని, యంగెస్ట్‌, గ్రేటెస్ట్ పోలీస్ ఆఫ్ ఇండియా అని మ‌న పోలీసుల‌ను దేశ‌వ్యాప్తంగా కీర్తిస్తున్నార‌ని సీఎం అన్నారు. తెలంగాణ పోలీసులు సాధిస్తున్న ఘ‌న‌త ప‌ట్ల సంతోషంగా ఉంద‌ని, వారంద‌రికీ హృద‌యాపూర్వకంగా అభినంద‌న‌లు తెలిపారు ———– పోలీసు శాఖ‌కు 500 కోట్ల బ‌హూమానం ఇస్తున్న‌ట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. కొత్త వాహ‌నాలు, మౌళిక స‌దుపాయాల కోసం ఆ డ‌బ్బును ఖ‌ర్చు చేయాల‌న్నారు. హైద‌రాబాద్ పోలీసుకు అద్భుత‌మైన పేరు వ‌చ్చింద‌న్నారు. చాలా గొప్ప రిజ‌ల్ట్స్ తీసుకు వ‌చ్చిన‌ట్లు మెచ్చుకున్నారు. తెలంగాణ ఏర్పాటు ఓ న్యాయ‌మైన డిమాండ్ అని, దానికి మీ స‌హ‌కారం ల‌భించిందని సీఎం కేసీఆర్ పోలీసుల‌ను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో నేను చేసిన ఉప‌న్యాసాలు మీరు విన్నారు, ఎవ‌రూ ఊహించ‌ని రాష్ట్రం క‌ష్ట‌ప‌డి సాధించాం. ఆ ల‌క్ష్యాలు నెర‌వేర్చాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మ‌న రాష్ట్ర పోలీస్ వ్య‌వ‌స్థ కీల‌క‌మైన వ్య‌వ‌స్త అన్నారు. రాష్ట్ర సాధ‌న‌లో పోలీసుల పాత్ర ప్రాముఖ్య‌మైంద‌న్నారు.

, ,

Comments are colsed